Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్
- 50 నిమిషాల పాటు ఇరువురి మధ్య సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఫోన్ చేశారు. దాదాపు ఇద్దరి మధ్య 50 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లుపై రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చించారు. ప్రతిపాదిత డిలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం సాధించే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే కేంద్రం ఈ చర్చలకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. డిలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర ప్రభుత్వం ఆయనకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ముందుగా ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ అధికారిక వైఖరిని ప్రభుత్వానికి తెలియజేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు సమాచారం. డిలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి ప్రతిష్ఠంభన లేదని, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందనే విశ్వాసంతో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్లును ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడమే ఈ సంప్రదింపుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్ష ఆందోళనలతో వరుసగా వాయిదా పడుతున్నాయి. జూలై 20న జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలు వంటి అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ.. డిలిమిటేషన్ బిల్లుపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని కేంద్రానికి సూచించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన సహా బిల్లు ముసాయిదాను అన్ని రాజకీయ పార్టీలకు పంపించి, బిల్లును ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య పలు అంశాలపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!