Haryana Polls: సాయంత్రం మరో జాబితాను విడుదల చేయనున్న కాంగ్రెస్.. ముగ్గురు ఎంపీల పోటీపై ఉత్కంఠ!
- సాయంత్రం మరో జాబితాను విడుదల చేయనున్న కాంగ్రెస్
- ముగ్గురు ఎంపీల పోటీపై ఉత్కంఠ!
- ఫైనల్ చేయనున్న కాంగ్రెస్ హైకమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టులను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న ముగ్గురు.. ఎమ్మెల్యేలకు పోటీ చేస్తామని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలు మినహా.. మిగతా అన్ని స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను వెల్లడించనున్నట్లు సమాచారం. మూడు స్థానాల ఎంపిక మాత్రం అధిష్టానానికి వదిలేసిట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీలందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేసినట్లు కూడా వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ఆరుగురు ఎంపీలు, రాజ్యసభలో రణదీప్ సింగ్ సూర్జేవాలా ఉన్నారు. అయితే ఎంపీలకు సీట్లు కేటాయింపుపై హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఇప్పటికే 41 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 49 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Box Office: రచ్చ రేపుతున్న శనివారం.. పాపం గోట్!
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు.. లోక్‌సభలో కొనసాగే కంటే.. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఐదేళ్ల పాటు అధికారం చెలాయించవచ్చని ఎంపీలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Ganesh Immersion: వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు యువకులు, ఓ బాలుడు గల్లంతు
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు జాబితాలను కాంగ్రెస్ విడుదల చేసింది. బీజేపీ, ఆప్ కూడా జాబితాలను వెల్లడించాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Simha Koduri Interview: ‘మత్తు వదలరా2’ని అందుకే దాచాం.. ‘సత్య’తో కెమిస్ట్రీ అదిరింది: : హీరో శ్రీ సింహ
తాజావార్తలు
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?