18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Redmi Watch 6 Active స్మార్ట్‌వాచ్
- ఇందులో 1.85 అంగుళాల AMOLED డిస్ప్లే ..
- బ్లూటూత్ కాలింగ్ సదుపాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi Watch 6 Active: షియోమీ (Xiomi) సబ్ బ్రాండ్ రెడ్మీ (Redmi) తన కొత్త స్మార్ట్‌వాచ్‌ను చైనాలో లాంచ్ చేసింది. రెడ్మీ వాచ్ 6 యాక్టీవ్ (Redmi Watch 6 Active) పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85 అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 140కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 470mAh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 18 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
AMOLED డిస్ప్లే:
ఇందులో 1.85 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 390 × 450 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు Always-On Display ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. టచ్ సపోర్ట్ ఉన్న ఈ స్క్రీన్ గరిష్ఠంగా 1,200 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. డిస్ప్లేకు 2.5D మైక్రో-కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌వాచ్ Xiaomi Surge OSపై పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉండటంతో స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీయకుండానే వాచ్ నుంచే నేరుగా కాల్స్ చేయడం, స్వీకరించడం చేయవచ్చు.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లు:
ఆరోగ్య పర్యవేక్షణ కోసం రెడ్మీ వాచ్ 6 యాక్టివ్‌లో ఆప్టికల్ సెన్సార్, యాక్సిలెరోమీటర్ను అందించారు. ఇవి హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించడంలో సహాయపడతాయి. అలాగే నిద్ర, ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేయడం, మహిళల ఆరోగ్య పర్యవేక్షణ, శ్వాస, రిలాక్సేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వాచ్‌కు IP68 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఇందులో 140కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అందించారు. వాకింగ్, ఇండోర్ రన్నింగ్, అవుట్డోర్ రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్యకలాపాలను ఆటోమేటిక్‌గా గుర్తించే సదుపాయం కూడా ఉంది. యాక్టివిటీకి సంబంధించిన రిమైండర్లు, విటాలిటీ ఇండికేటర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర ఫీచర్లలో మ్యూజిక్ కంట్రోల్స్, అలారం, కౌంట్‌డౌన్ టైమర్, స్టాప్‌వాచ్, ఫ్లాష్‌లైట్, వాతావరణ సమాచారం, టు-డూ లిస్ట్, వరల్డ్ క్లాక్, రిమోట్ కెమెరా కంట్రోల్ వంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి.
బ్యాటరీ బ్యాకప్:
ఈ స్మార్ట్‌వాచ్‌లో 470mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీని అందించారు. గరిష్ఠ వినియోగ పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని రెడ్మీ చెబుతోంది. ఆల్వేస్-ఆన్ డిస్ప్లేను సాధారణ వినియోగంలో ఆన్ చేసి ఉంచితే సుమారు 6 రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుందని పేర్కొంది. ఈ వాచ్ ఆండ్రాయిడ్ 8.0 లేదా ఆ తర్వాతి వెర్షన్లు, iOS 14 లేదా ఆ తర్వాతి వెర్షన్లకు అనుకూలంగా ఉంటుంది. Xiaomi Health యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
ధర:
చైనాలో Redmi Watch 6 Active ధర 349 యువాన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.4,900. ప్రస్తుతం చైనా మార్కెట్లో గన్ మెటల్, పింక్ ఆరంజ్, సిల్వర్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ స్మార్ట్‌వాచ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇక్కడ ధర ఎంత ఉంటుంది అనే వివరాలను రెడ్మీ ఇంకా వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?