Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks: వంటగదిలో “చాకు” (Knife) ఎంత ముఖ్యమో ఎక్కువగా చెప్పక్కర్లేదు. కూరగాయలు, పండ్లు లేదా ఇతర పదార్థాలను కోయడానికి చాకు పదునుగా ఉండాలి. చాకు పదును తగ్గిపోతే పని నెమ్మదిగా జరగడమే కాకుండా.. కోసే సమయంలో ఆహార పదార్థాలపై నుంచి జారి చేతికి గాయమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పదును తగ్గిన ప్రతిసారీ కొత్త చాకు కొనడం కంటే.. ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతులతో చాకు పదును పెంచుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..
చాకు పదును ఎందుకు తగ్గుతుంది?
చాకు పదును తగ్గడానికి మనం సాధారణంగా పట్టించుకోని అనేక కారణాలు ఉంటాయి. చాలా గట్టిగా ఉండే పదార్థాలను చిన్న చాకులతో కోయడం వల్ల బ్లేడ్ పదును తగ్గుతుంది. చాకులను సరిగ్గా నిల్వ చేయకపోతే తేమ కారణంగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే చాకును పదేపదే కడగడం, ముఖ్యంగా కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టకుండా ఉంచడం వల్ల కూడా బ్లేడ్ దెబ్బతినవచ్చు. మార్బుల్, గ్రానైట్ వంటి గట్టి రాతి ఉపరితలాలపై నేరుగా పెట్టి పదార్థాలను కోయడం వల్ల కూడా చాకు పదును త్వరగా తగ్గిపోతుంది.
Also Read
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
సిరామిక్ వస్తువులతో:
ఇంట్లో ఉండే సిరామిక్ టీ మగ్ను ఉపయోగించి చాకు పదును చేయవచ్చు. సాధారణంగా మగ్ అడుగుభాగంలో పెయింట్ లేదా గ్లేజ్ లేని కొంత గరుకైన భాగం ఉంటుంది. చాకు బ్లేడ్‌ను ఆ గరుకు భాగంపై సుమారు 20 డిగ్రీల కోణంలో ఉంచి, ముందుకు వెనక్కు నెమ్మదిగా రుద్దాలి. బ్లేడ్‌కు రెండు వైపులా ఇలా చేయడం వల్ల పదును కొంత మెరుగుపడుతుంది. అయితే మగ్ లేదా చాకు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేయడం ఇంపార్టెంట్.
తడిపిన రాయితో:
సరిగ్గా ఉపయోగించగల పదును పెట్టే రాయి ఉంటే దానిని నీటితో తడిపి ఉపయోగించవచ్చు. చాకు బ్లేడ్‌ను సరైన కోణంలో రాయిపై ఉంచి నెమ్మదిగా ముందుకు వెనక్కు రుద్దాలి. కొంత సమయం పడుతుంది కానీ బ్లేడ్ పదును మెరుగుపడే అవకాశం ఉంటుంది. చాకు పదును పెట్టే ప్రత్యేక షార్పెనింగ్ స్టోన్ అందుబాటులో ఉంటే దానిని ఉపయోగించడం సాధారణ రాయిని ఉపయోగించడం కంటే మెరుగైన ఎంపిక.
సాండ్‌పేపర్‌తో..
చాకు పదును పెంచేందుకు సాండ్‌పేపర్‌ను కూడా కొందరు ఉపయోగిస్తారు. సాండ్‌పేపర్‌ను సమతలమైన ఉపరితలంపై ఉంచి, దానిపై చాకు బ్లేడ్‌ను సరైన కోణంలో ఉంచి తేలికగా రుద్దాలి. అయితే ఈ పద్ధతి చాకు పదునుపై పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపవచ్చు. ఎక్కువగా పదును కోల్పోయిన చాకుకు ఇది శాశ్వత పరిష్కారం కాదు.
చాకుతో ప్రమాదం:
పదును తగ్గిన చాకుతో కూరగాయలు లేదా పండ్లు కోసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. ఈ సమయంలో చాకు ఆహార పదార్థంపై సరిగ్గా పట్టుకోకుండా జారిపోతే చేతులు, వేళ్లకు గాయాలు కావచ్చు. అందుకే చాలా మొద్దుబారిన చాకును అలాగే ఉపయోగించడం కంటే సరైన విధంగా పదును పెట్టడం మంచిది. అలాగే తుప్పు పట్టిన చాకులను ఆహారం తయారీలో ఉపయోగించకపోవడం మంచిది. చాకులను ఉపయోగించిన తర్వాత శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టి, పొడి ప్రదేశంలో భద్రపరచాలి.
జాగ్రత్త తప్పనిసరి:
చాకు పదును పెట్టే సమయంలో చేతులకు గ్లౌజులు లేదా ఇతర రక్షణ పరికరాలు ఉపయోగించడం, బ్లేడ్‌ను శరీరానికి దూరంగా ఉంచడం, పిల్లలకు అందకుండా పని చేయడం ముఖ్యం. బ్లేడ్ తీవ్రంగా దెబ్బతిన్నా లేదా తుప్పు ఎక్కువగా పట్టినా ఇంటి చిట్కాల కంటే కొత్త చాకు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం సురక్షితం.
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!