Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Simha Koduri Interview For Mathu Vadalara 2

Simha Koduri Interview: ‘మత్తు వదలరా2’ని అందుకే దాచాం.. ‘సత్య’తో కెమిస్ట్రీ అదిరింది: : హీరో శ్రీ సింహ

Published Date :September 9, 2024 , 3:23 pm
By Bhargav Chaganti
  • బ్లాక్ బస్టర్ మత్తు వదలరాకు సీక్వెల్ 'మత్తువదలరా2'
  • రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న 'మత్తువదలరా2'
  • హీరో శ్రీ సింహ విలేకరుల సమావేశం
Simha Koduri Interview: ‘మత్తు వదలరా2’ని అందుకే దాచాం.. ‘సత్య’తో కెమిస్ట్రీ అదిరింది: : హీరో శ్రీ సింహ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Simha Koduri Interview For Mathu Vadalara 2: బ్లాక్ బస్టర్ మత్తు వదలరాకు సీక్వెల్ ‘మత్తువదలరా2’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీ సింహ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘మత్తువదలరా2’ కు ప్రీపరేషన్ ఎలా జరిగింది ?
-చాలా బాగా జరిగింది. గెటప్పు, క్యారెక్టర్స్ స్టయిలింగ్ మారింది. ‘హీ’ టీం ఏజెంట్స్ గా చూపించాం. ఫస్ట్ పార్ట్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా వుంటాయి.

Also Read

  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

మత్తువదలరా2 ఆలోచన మొదటి నుంచా ఉందా?
-రిలీజైయ్యాక హిట్ అయిన తర్వాత సీక్వెల్ చేద్దామని నాకు, చెర్రీ గారికి వుండేది. డైరెక్టర్ రితిష్ లాస్ట్ ఇయర్స్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు.

-ఫస్ట్ పార్ట్ లో వున్న క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతాయి. డెలివరీ బాయ్స్ నుంచి ఏజెంట్స్ ఎలా అయ్యారనే లింక్ చూపిస్తాం.

పార్ట్ వన్ పెద్ద హిట్ట్ అయ్యింది కదా.. రెండో పార్ట్ అంచనాలు విషయంలో ఒత్తిడి తీసుకున్నారా?
-సినిమా హిట్ అయ్యిందని పార్ట్ 2 తీస్తే ఖచ్చితంగా ఒత్తిడి వుంటుంది. కానీ డైరెక్టర్ రితిష్ కి ఈ కథ ఫస్ట్ పార్ట్ కి మ్యాచ్ అయ్యేలా ఆర్గానిక్ గా వచ్చింది. అందుకే నేచురల్ గా అంతా సెట్ అయ్యింది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ దే.

రిలీజ్ టైం కే సినిమా బయటికి వచ్చింది. అంతకుముందు అంత సైలెంట్ గా ఉండటానికి కారణం?
– ఇదొక కొత్త స్ట్రాటజీ లా అనుకున్నాం. అనౌన్స్ చేస్తే బజ్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ హిట్ కాబట్టి ఆడియన్స్ ఎక్సయిట్ అవుతారు. అయితే సినిమా పూర్తయి విడుదలకి వచ్చేసరికి దానిపై బజ్ తగ్గొచ్చు. ఎక్సయిట్మెంట్ పలచబడకముందే వేడివేడిగా వడించేయాలనే ఉద్దేశంలో ఇలా చేశాం. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే మా స్ట్రాటజీ వర్క్ అయ్యిందనిపించింది.

ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు కదా.. ఆయన రియాక్షన్ ఏమిటి?
– చాలా ఎంజాయ్ చేశారు. టీజర్ ట్రైలర్ సాంగ్ చూసి చాలా ఎక్సయిట్ అయ్యారు. ఆయనకు జెన్యూన్ గా నచ్చితేనే అంత టైం స్పెండ్ చేస్తారు.

ఫారియాతో వర్క్ చేయడం గురించి ?
-ఫారియా ఫన్నీ క్యారెక్టర్స్ కి బాగా సెట్ అవుతుంది. నేచురల్ గా తనలో ఫన్ వుంటుంది. ఇందులో తన పాత్ర యాక్షన్ కూడా వుంది. ఈ క్యారెక్టర్ కి ఫారియా యాప్ట్. ఈ సినిమాలో తను సాంగ్ రాయడంతో పాటు కొరియోగ్రాఫ్ చేసింది. అది ప్రమోషన్స్ కి బాగా యూజ్ అయ్యింది.

ఇది మర్డర్ మిస్టరీనా… డ్రగ్స్ బ్యాక్ డ్రాపా ?
-ఫస్ట్ పార్ట్ లో మర్డర్ ఎవరు చేశారు అనే ట్రాక్ తో పాటు డ్రగ్స్ ట్రాక్ వుంటుంది కదా.. ఇందులో కూడా ఆ రెండితో పాటు ఇంకొన్ని లేయర్స్ యాడ్ అవుతాయి.

మ్యూజిక్ లో ఎక్సపర్మెంట్ చేస్తున్నారా?
-ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయ్యిందో దాని బీజీఎంకి కూడా అంత మంచి పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ కి కూడా అలానే వస్తుందనే నమ్మకం వుంది.

మత్తువదలరా రీరిలీజ్ షో తర్వాత ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది?
-ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం కలిసి చూశాం. కొంత మంది ఫస్ట్ పార్ట్ ని థియేటర్స్ లో మిస్ అయ్యారు. అలా మిస్ అయన వారంతా వచ్చి చూడటం చాలా హ్యాపీగా అనిపించింది.

రాజమౌళి గారి రియాక్షన్ ఏమిటి?
-రాజమౌళి గారికి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. చాలా ఎంజాయ్ చేశారు. ప్రోడక్ట్ విషయంలో హ్యాపీగా వున్నారు.

ఈ సినిమాలో మీమ్స్ రిఫరెన్స్ ఎంతవరకూ వుంటుంది?
-ఫస్ట్ పార్ట్ లో ఎంతవరకూ వున్నాయో అంత వరకు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం వుంటాయి. సోషల్ మీడియాతో పరిచయం లేని ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే కథ, క్యారెక్టర్స్ వుంటాయి. ఫన్, థ్రిల్ డబుల్ వుంటుంది.

సత్య, మీ కాంబినేషన్ సూపర్ కదా.. సెకండ్ పార్ట్ లో ఎలా వుంటుంది ?
-మా ఇద్దరి కెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్ లో నేచురల్ గా వచ్చింది. సూపర్ గా వర్క్ అయ్యింది. సెకండ్ పార్ట్ లో మేమిద్దరం త్రూ అవుట్ కనిపిస్తాం. వెన్నెల కిశోర్ ఇందులో ఫస్ట్ పార్ట్ తో సంబంధం లేని క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.

డైరెక్టర్ రితిష్ రానా గురించి?
-రితిష్ చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. సినిమా విజన్ బోర్డ్ తన మైండ్ లో వుంటుంది.

మత్తువదలరాని ఫ్రాంచైజ్ గా కొనసాగిస్తారా?
-మాకు చేయాలనే వుంది. చేసే అవకాశం వున్న ఫ్రాంచైజ్ ఇది.

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల గురించి?
-ఇలాంటి అద్భుతమైన టీంని ఇచ్చిన నిర్మాతలు థాంక్స్ చెబుతున్నాను. ఫస్ట్ పార్ట్ కి మంచి పేరు వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ కి స్కేల్ పెంచారు. బాగా ఖర్చుపెట్టారు. సినిమాని గ్రాండ్ గా తీశారు.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
అన్నీ డెవలప్మెంట్ లో వున్నాయి. ఇది అయిన తర్వాత వన్ బై వన్ చేయాలనేది నా ఆలోచన.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mathu Vadalara 2
  • Simha Koduri
  • Simha Koduri Interview
  • Sri Simha Interview

తాజావార్తలు

  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions