Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
- అదుపుతప్పిన బైక్.. ఒకరి ప్రాణాలు బలి
- మరో యువకుడి పరిస్థితి విషమం
- హెల్మెట్‌తో తప్పిన ప్రాణాపాయం
- కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gachibowli Bike Accident: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సహస్ర చటోపాధ్యాయ, అభిరూప్, అబ్బాస్ (25) అనే ముగ్గురు స్నేహితులు ఒకే బైక్‌పై ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపానికి రాగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అబ్బాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఒకరి పరిస్థితి విషమం.. హెల్మెట్ వల్ల ప్రాణాలతో బయటపడ్డ మరొకరు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిరూప్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, మరో యువకుడు సహస్ర చటోపాధ్యాయ తలకు హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతి చెందిన అబ్బాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read
తాజావార్తలు
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
ట్రెండింగ్
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!