Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!
- బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం..
- వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను పెంచిన బీహార్ సర్కార్..
- రూ. 400 నుంచి రూ. 1,100 ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం నితీన్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌లోని వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు అందించే పింఛను సొమ్మును పెంచేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.400 పెన్షన్ మొత్తాన్ని దాదాపు ట్రిపుల్ చేసి.. రూ.1,100లకు పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అయితే, పెంచిన పెన్షన్లు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల కోటి మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందుతాయి. సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులైన మహిళలు అందరికీ ఇకపై రూ.1,100 మా ప్రభుత్వం అందించనుంది అని ప్రకటించారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.. జులై 1 నుంచి లబ్ధిదారులకు ఈ మొత్తం పెన్షన్ పంపిణీ చేయనున్నామని తేల్చి చెప్పారు. అదే నెల 10వ తేదీ వరకు అందరికీ అందించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: DGCA: ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కఠిన చర్యలు.. ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశాలు
కాగా, బీహార్ రాష్ట్రంలోని వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకే మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ఆ దిశగా తాము కృషి చేస్తున్నాం అని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనతాదళ్ (యూనైటెడ్), ఎన్డీయే, ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ తన ఎన్నికల వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!