టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంటూ వరుస హిట్ లతో ధూసుకుపోతున్నారు న్యాచురల్ స్టార్ నాని. అందరిలా కాకుండా కెరీర్‌ను ఓ పద్దతి, ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేస్తున్నారు నాని. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇప్పుడు ఊర మాస్ యాంగిల్ లో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. బహుశా ఇదే అతని సక్సెస్ సీక్రెట్ కాబోలు. అంతేకాదు ఓ సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ డైరెక్టర్లకు చాన్సులిస్తున్నాడట నాని.
Also Read : Krithi Shetty : టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన కృతి శెట్టి..?
అవును.. సినీ పరిశ్రమలో హీరోలు ఒక డైరెక్టర్‌తో రిపీట్ అవ్వడం ఓ సెంటిమెంట్‌లా ఫాలో అవుతుంటారు. కానీ నాని మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. టాలెంట్ ఉంటే చాలు అనే నమ్మకంతో ముందుకెళ్తున్నాడు. ‘అంటే సుందరానికి’ తర్వాత కూడా అదే డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు మరోసారి ‘సరిపోదా శనివారం’ అవకాశం ఇచ్చిన నాని.. ‘దసరా’ తో సూపర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ కలసి ‘ప్యారడైజ్’ రూపొందిస్తున్నాడు. అలాగే ‘హిట్’ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలనాతో బలమైన ప్రొఫెషనల్ ర్యాపో ఏర్పరుచుకున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా వార్త ఏంటంటే..
‘హాయ్ నాన్న’ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు శౌర్యవ్‌కు మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట నాని. అవును శౌర్యవ్ తారక్ కోసం ఓ స్టోరీ రెడీ చేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా.. మళ్లీ నానిని సంప్రదించినట్లు టాక్. ఆ ప్రాజెక్టు తారక్ కోసమేనా..? లేక నాని కోసం కొత్తగా ఓ కథ వినిపించాడా అనే క్లారిటీ లేకపోయినప్పటికీ, నాని మరోసారి శౌర్యవ్‌ను ఆదుకునేందుకు రెడీ అవుతున్నాడన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్.