Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన టి. దిలీప్ దాదాపు ఐదేళ్ల తన పదవీకాలాన్ని విజయవంతంగా ముగించుకుని టీమిండియా నుంచి వైదొలిగారు. 2021 నవంబర్‌లో భారత జట్టు సెటప్‌లోకి అడుగుపెట్టిన ఆయన స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టెస్టు సిరీస్ శుభదీప్కు మొదటి అసైన్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో ఐదేళ్ల అనుబంధం ముగియడంపై టి. దిలీప్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు.
ఈ ఐదేళ్ల పయనం చాలా అద్భుతంగా సాగిందని, తన భావాలను వ్యక్తపరచడానికి సరైన పదాలు దొరకడం లేదని దిలీప్ పేర్కొన్నారు. మొదటి రోజు నుంచే వంద శాతం శ్రమించాలనే లక్ష్యంతో పనిచేశానని, తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ రంగానికి ఫీల్డింగ్ ద్వారా సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో తాను ప్రతిపాదించిన ‘బెస్ట్ ఫీల్డర్ మెడల్’ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, ఆ జ్ఞాపకాలు తన గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయని వెల్లడించారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
దిలీప్ పదవీకాలంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను అందుకుంది. టీమిండియా 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2023, 2025 లలో ఆసియా కప్‌లను ముద్దాడింది. 2023 వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2021-23) లలో రన్నరప్‌గా నిలిచింది.
తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకి, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌లకు దిలీప్ ధన్యవాదాలు తెలిపారు. తన హయాంలో నాయకత్వం వహించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, ఒక సువర్ణాధ్యాయం ముగిసినప్పటికీ ఐదేళ్లపాటు టీమిండియా బాడ్జ్ ధరించడం ఎప్పటికీ గర్వకారణంగా ఉంటుందని ఆవేదనతో వీడ్కోలు పలికారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!