Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
- విద్యార్థుల భాషపై దేశ వ్యాప్తంగా చర్చ
- జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
- ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసిన ఒలింపిక్ విజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విద్యార్థుల ఉద్యమంలో నిరసనకారులు ఉపయోగించిన భాషపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ప్రభుత్వాన్ని, దేశ ప్రధానిని దూషించడంతో దిగ్భ్రాంతికరంగా మారింది. ఇప్పటికే ప్రధాని మోడీ క్షమిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పలువురు ప్రముఖులు విద్యార్థుల భాషను తప్పుపడుతున్నారు.
ఒలింపిక్ విజేత షూటర్ మను భాకర్ కూడా తప్పుపట్టారు. దూషించడం మంచిది కాదని హితవు పలికారు. యువతలో పెరుగుతున్న దుర్భాషల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. తిట్టడం ఎప్పటికీ ‘కూల్’ కాదని.. ఒక వ్యక్తి తన మాటల ద్వారానే గుర్తింపు పొందుతాడని పేర్కొన్నారు. జెన్-జీ తరం వారి అసభ్య పదజాలంపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ప్రజలు తమ భాషను, పదాలను వివేకంతో ఎంచుకోవాలని కోరారు.
Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
మను భాకర్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇలా రాశారు. ‘‘మనం ఉపయోగించే భాష మన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీ మాటలను తెలివిగా ఎంచుకోండి. ఎందుకంటే కాలక్రమేణా మీరు ఆలోచించే, చెప్పే, చేసే దానిగానే మారిపోతారు. ఈ రోజుల్లో తిట్టడాన్ని ఆత్మవిశ్వాసానికి లేదా ఆధునికతకు చిహ్నంగా భావిస్తున్నారని, కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. తిట్టడం కూల్ కాదు. దూషణ భాషను ఉపయోగించడం ఎప్పటికీ కూల్ కాదు.’’ అని పేర్కొన్నారు. యువతకు ‘కూల్’ అనే పదానికి తన నిర్వచనాన్ని కూడా పంచుకున్నారు. నిజమైన ‘కూల్‌నెస్’ అంటే కష్టపడటం, ఇతరులను, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, నిజాయితీగా విజయం సాధించడం, మీ తల్లిదండ్రులకు, దేశానికి కీర్తిని తీసుకురావడం అని తెలిపారు.
ఇటీవలి కాలంలో దుర్భాషలు సర్వసాధారణం అయిపోయినందువల్లే తాను ఈ విషయాన్ని లేవనెత్తానని స్పష్టం చేశారు. చాలా మంది దానిని సాధారణమైనదిగా లేదా ఫ్యాషన్‌గా భావించి, ఆలోచించకుండానే రోజువారీ సంభాషణలో దుర్భాషలను ఉపయోగించడం మొదలుపెట్టారని గుర్తుచేశారు.
ఈ విషయంపై పలువురు ఇతర ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అసమ్మతి తెలిపే హక్కును ఇస్తుంది కానీ.. అవమానించే హక్కును ఇవ్వదని నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఒక వ్యక్తిని వారి మాటల ద్వారానే గుర్తిస్తారని, భాష గౌరవాన్ని లేదా అగౌరవాన్ని నిర్ణయిస్తుందని నటుడు అశుతోష్ రాణా తెలిపారు. అంతకుముందు, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా నిరసనల సమయంలో ఉపయోగించిన భాషపై తీవ్రంగా వ్యాఖ్యానించారు.
The language we choose reflects our personality and the kind of person we are. Choose your words wisely, because over time, you become what you think, what you speak, and what you practice.
Using bad language is not cool. Abusing is not cool.
Let’s keep the definition of cool… pic.twitter.com/8LN53t4V0h
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 2, 2026
తాజావార్తలు
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!