Kolkata: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం, హత్య జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్నారు. సాల్ట్ లేక్‌లోని స్వాస్త్య భవన్ వెలుపల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (శనివారం) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ‘మాకు న్యాయం కావాలి’ అనే నినాదాల మధ్య నిరసన తెలుపుతున్న వైద్యులను ఉద్దేశించి సీఎం మమతా మాట్లాడుతూ.. నేను ముఖ్యమంత్రిగా కాకుండా మీ ‘దీదీ’గా మిమ్మల్ని కలవడానికి వచ్చాను.. నా పదవి పెద్దది కాదు.. ప్రజల పదవులు పెద్దవి అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, నేను నిద్రపోలేదు.. ఎందుకంటే, నిన్న రాత్రి మీరంతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేయడంతో.. మీ డిమాండ్లను నెరవేరుస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను అన్నారు. నేను సీబీఐని అభ్యర్థిస్తాను.. మీరు నన్ను విశ్వసిస్తే దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి అని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.
Read Also: Jonty Rhodes: నేను లోకల్, నాది గోవా.. జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక, మరోవైపు.. నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కొన్ని విపక్ష శక్తులు ట్రై చేస్తున్నాయని విమర్శలు గుప్పించింది. ఈ ఆరోపణలకు ఒక వీడియో క్లిప్‌ను రుజువుగా టీఎంసీ చూపించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య విభాగం ప్రాంగణం సమీపంలో పోలీసులు భద్రతను భారీగా పెంచేశారు. ఈ కుట్రతో ప్రమేయం ఉందని అనుమానిస్తోన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిచారు.