అనుపమ పరమేశ్వరన్ కెరీర్ బుల్లెట్ వేగంతో దూసుకెళుతోంది. లైనప్ విషయంలో నిజంగానే జోరు చూపిస్తోంది కానీ సినిమాలు ఆన్ టైంలో థియేటర్లకు రాకుండా ఆమెకే చుక్కలు చూపిస్తున్నారు మేకర్స్. చెప్పుకోవడానికి చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. కానీ ఇందులో సగానికి పైగా సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పైకి రావడానికి తడబడుతున్నాయి. లాక్ డౌన్ నుండి రీసెంట్లీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వరకు ఇదే పరిస్థితి.
Also Read : RC16 : సెట్స్ లో అడుగుపెడుతున్న జాన్వీ.. ఢిల్లీకి వెళ్తున్న’పెద్ది’
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన మూవీ జానకి వర్సెస్ స్టేట్. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సురేష్ గోపీ, అనుపమ కీ రోల్స్ చేశారు. జూన్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ చివరి నిమిషంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ గ్రాంట్ చేసేందుకు నిరాకరించింది. ఇందులో జానకి అంటే సీతమ్మ పేరని, విక్టిమ్‌కు దేవతా మూర్తుల పేర్లు పెట్టకూడదని అబెక్షన్ పెట్టింది. కేరళలో సర్టిఫికేషన్ జారీ అయినప్పటికీ ముంబయిలో సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నో చెప్పిందట. జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ మాత్రమే కాదు.. అనుపమ నటించిన మరో మలయాళ ఫిల్మ్ పెట్ డిటెక్టివ్ కూడా ఏప్రిల్ 25 అంటూ ఎనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేసింది. ఇక ఎప్పుడో కంప్లీటైన లాక్ డౌన్ లాస్ట్ ఇయరే జూన్ రిలీజ్ అనుకుంటే ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. తెలుగు ఫిల్మ్ పరదా పరిస్థితి ఏంటో తెలియదు. ఇవే కాకుండా తెలుగులో కిష్కింద ఫురి, భోగిలో నటిస్తోంది. ఇక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ధ్రువ్‌తో నటిస్తోన్న బిసాన్ మాత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అని ప్రకటించారు. అదైనా అనుకున్న టైమ్ కు వస్తుందో లేదో.