Mancherial: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ దురదృష్టకర ఘటన జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా నుజ్జునుజ్జయి అయిపోగా, మరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Also:HONOR X9C 5G: డిజైన్‌లో క్లాస్, పెర్ఫార్మెన్స్‌లో దమ్మున్న ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..!
ఈ ఘటనకు గురైన లారీలలో ఒకటి ప్రఖ్యాత సబ్బు బ్రాండ్ అయిన సంతూర్ సబ్బులను ఫుల్ గా లోడ్ చేసి తీసుకెళ్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి చుట్టుపక్కల ఉన్న జనం పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు చేరుకున్నారు. అయితే బాధితులకు సహాయం చేయాల్సిన సమయంలో కొందరు లారీలోని సబ్బుల పెట్టెలను ఎగబడి తీసుకెళ్లడం ప్రారంభించారు.
Read Also: RC16 : సెట్స్ లో అడుగుపెడుతున్న జాన్వీ.. ఢిల్లీకి వెళ్తున్న’పెద్ది’
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు లారీ లోడు సగం వరకూ ఖాళీ అయిపోయింది. లక్షల రూపాయల విలువ చేసే సబ్బులు నిమిషాల్లో ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నైతిక విలువలు పక్కన పెట్టి సామూహికంగా ‘చోరీ’ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు. ఆ తర్వాత మృత డ్రైవర్ శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన స్థానికులు, లారీ నుండి సబ్బులు ఎత్తుకెళ్లడం మనుషుల మానవత్వంపై ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.