హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఇద్దరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని మునుని ఖాడ్‌లో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కులులో బుధవారం మూడు ‘‘క్లౌడ్ బరస్ట్’’ చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. కీలక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. సైన్జ్, గడ్సా, సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీంతో జీవ నాలా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. స్థానిక ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక వరద కారణంగా నదులు మరియు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
Cloudbursts: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ‘‘క్లౌడ్ బరస్ట్’’తో మెరుపు వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 15 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు.