రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. గత రెండున్నరేళ్లుగా సాగుతున్న పోరులో తొలిసారిగా ఇరు దేశాలు పరస్పరం కొంత ఉదారతను చాటుకున్నాయి. రష్యా -ఉక్రెయిన్ మొదటిసారిగా యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. ఇందులో ఇరువర్గాలు 103 మందిని విడుదల చేశాయి. మొత్తం 206 మంది సైనికులు విముక్తి పొందారు. మార్పిడి చేసుకున్న రష్యన్ సైనికులు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో బందీలుగా ఉన్నారని వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్ శనివారం నివేదించింది. గత నెలలో.. ఉక్రేనియన్ సైన్యం తన మొదటి అతిపెద్ద చొరబాటులో రష్యాలోని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.
READ MORE: Minister Narayana: విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి ఆగ్రహం
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని ఆయన కలిశారు. అంతకుముందు, ప్రధాని మోదీ మాస్కోకు వెళ్లి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. ఇటీవల, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముఖాముఖి మాట్లాడారు. యుద్ధానికి ముగింపు పలికే చర్చల్లో భారత్ అభిప్రాయాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తన ప్రభావాన్ని ఉపయోగించి రష్యాను యుద్ధాన్ని ముగించేలా ఒప్పించాలని భారత్‌ను కోరారు.
READ MORE: గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
రష్యా -ఉక్రెయిన్ మధ్య ఖైదీల మార్పిడిపై ఒప్పందానికి ముందు , రెండు వైపుల మధ్య యుద్ధానికి బలమైన సన్నాహాలు కొనసాగే సూచనలు కనిపించాయి. రష్యాలో లోతుగా దాడి చేసేందుకు అనుమతి కోసం పాశ్చాత్య దేశాలకు ఉక్రెయిన్ కొత్త విజ్ఞప్తి చేసింది. కాగా ఒకరోజు ముందు అమెరికా, బ్రిటన్ నేతల మధ్య జరిగిన సమావేశంలో సుదూర ఆయుధాల వినియోగంపై వారి విధానంలో స్పష్టమైన మార్పు రాలేదు. రష్యన్ ఫెడరేషన్‌లోని ఆయుధ డిపోలు, విమానాశ్రయాలు మరియు సైనిక స్థావరాల నుంచి రష్యా ఉగ్రవాదం ఉద్భవించిందని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం అన్నారు.
READ MORE: Cancer Vaccine: ఆశలు పెంచుతున్న “క్యాన్సర్ వ్యాక్సిన్”..
యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు
రష్యాలో అంతర భూభాగంలో దాడులను అనుమతించడం ద్వారా, యుద్ధాన్ని ముగించే దిశలో వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఆండ్రీ యెర్మాక్ అన్నారు. ఒక నివేదిక ప్రకారం.. రష్యా రాత్రిపూట ఉక్రెయిన్‌లో మరిన్ని డ్రోన్, ఫిరంగి దాడులను నిర్వహించిందట. రష్యా భూభాగంలోని లోతైన లక్ష్యాలను చేధించడానికి పాశ్చాత్య దేశాల నుంచి పొందిన సుదూర ఆయుధాలను ఉపయోగించడాన్ని ఆమోదించాలని ఉక్రేనియన్ అధికారులు పదేపదే తమ మిత్రదేశాలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు, అమెరికా ఇచ్చిన ఆయుధాలను ఉక్రెయిన్‌తో రష్యా సరిహద్దులోని పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించేందుకు అమెరికా కీవ్‌కు అనుమతి ఇచ్చింది.