అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను అమెరికా రద్దు చేసింది. త్వరలో వారంతా బహిష్కరణకు గురికానున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు అక్రమ వలసదారులపై ట్రంప్ వేటు వేస్తున్నారు.
Operation Indravati: గ్యాంగ్ వార్‌తో కల్లోలంగా మారిన హైతీ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం ‘‘ఆపరేషన్ ఇంద్రావతి’’ని ప్రారంభించింది. కరేబియన్ దేశమైన హైతీలో సాయుధ ముఠాలు అక్కడి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్న భారతీయులను సమీపంలో డొమినికన్ రిపబ్లిక్‌కి తరలించేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
Haiti : హైతీలో క్షీణిస్తున్న శాంతి భద్రతల దృష్ట్యా కరేబియన్ దేశం 90 మంది పౌరులను స్వదేశాలకు పంపాలని చూస్తోంది. హైతీలో 75 నుంచి 90 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 60 మంది అవసరమైతే భారత్‌కు తిరిగి రావాలని భారత అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Haiti: కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
కరేబియన్ దీవి హైతీలో ఘోరప్రమాదం సంభవించింది. కేప్ హైతియాన్‌లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దాదాపు 20 కి పైగా ఇళ్లు మంటల్లో చిక్కుకున్నట్టు స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ పేర్కొన్నారు. మృతుల సంఖ్యను ఇప్పుడే అంచనావేసి చెప్పలేమని, ఇళ్లల్లో ఉండి మరణించిన వారిని గుర్తించాల్సి ఉందని, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంపై హైతీ ప్రధాని…
శనివారం రోజున కరేబియన్ దీవుల్లోని హైతీలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప విధ్వంసానికి వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1300 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో, శిధిలాల కింద చిక్కుకున్న వారికి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైన సంగతి తెలిసిందే. రాజధాని పోర్ట్ ఓ…