Karunakaran : ఇన్నాళ్లకు ఓ అవకాశాన్ని దక్కించుకున్న తొలిప్రేమ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karunakaran : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి ప్రేమ’. ‘ఎస్‌ఎస్‌వీ ఆర్ట్స్’ బ్యానర్‌పై జి.వి.జి.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 4వ సినిమాగా వచ్చిన ‘తొలిప్రేమ’ పవన్ కళ్యాణ్ కి సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా కంటే ముందు పవన్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ , ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, తమ్ముడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిని స్టార్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. అందుకే ‘తొలిప్రేమ’ పవన్ సినిమాలపై జనాలకు నమ్మకం కలిగించిందనే చెప్పాలి. 1998 జులై 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తయ్యాయి.
Read Also:Jr.NTR: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..?
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
పవన్ అభిమానులు ఆ సినిమాను అంత తొందరగా మరిచిపోలేరు. ఇప్పుడు చూసిన కూడా ఆ సినిమాను ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. రీ రిలీజ్ టైం లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. పవన్ బాక్సాఫీస్ కెరీర్ కు ఈ సినిమా ఒక మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక తొలిప్రేమ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణాకరన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశాడు.. కానీ తొలిప్రేమ లాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2010లో ప్రభాస్ తో చేసిన డార్లింగ్ సినిమా తర్వాత హిట్ కొట్టలేదు.
Read Also:T20 World Cup 2024: భారత్ సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!
ఆ తర్వాత చేసిన సినిమాలు వరసగా డిజాస్టర్ అయ్యాయి. 2018 లో సాయి ధరమ్ తేజ్ తో ‘తేజ్ ఐ లవ్ యు’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత అతను మళ్లీ కనిపించలేదు. మధ్య మధ్యలో చిన్న హీరోతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని వార్తలు వినిపించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇక ఇన్నేళ్లకు ఈ దర్శకుడు మళ్ళీ సీరియస్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వర్క్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అది కూడా దిల్ రాజు లాంటి కాంపౌండ్ లోనే సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు తన బ్రదర్ కుమారుడు ఆశిష్ రెడ్డిని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని చాలామంది దర్శకులతో కొత్త కథలపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ క్రమంలో కరుణాకరన్ రావడంతో ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు ఇప్పటి వరకు లవ్ స్టోరీలే ఎక్కువగా రాసుకున్నాడు. మరి ఆశిష్ రెడ్డితో ఎలాంటి సినిమా చేస్తాడో వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు