Adivi Sesh: ‘హిట్ 2’ థియేటర్లను హిట్ చేసేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adivi Sesh: హీరో నాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా ‘అ!’ను నిర్మించాడు. అది చక్కని పేరు తెచ్చిపెట్టడంతో పాటు జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది. ఇక రెండో చిత్రంగా ‘హిట్’ అనే సీట్ థ్రిల్లర్‌ను రూపొందించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ కాకుండా ఈ ఫ్రాంచైజ్ మూవీలో అడివి శేష్ నటిస్తున్నాడు. ‘ది సెకండ్ కేస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్ 2’నూ సూపర్ హిట్ చేయాలనే తపనతో స్క్రిప్ట్ ను తయారు చేశారు.
మొదటి భాగాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ కూతురు మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో తీయగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి. ఈ ఎగ్జయిటింగ్ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. అడివి శేష్ తో పాటు మీనాక్షి చౌదరి, రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ మూవీని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేశారు. ‘మేజర్’తో చక్కని విజయాన్ని అందుకున్న అడివి శేష్ కు ‘హిట్ 2’ ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read
- Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
- Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!