కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించిన కూలీ ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. మరోవైపు జైలర్ 2 షూట్ లో పాల్గొంటుంన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా బిగ్గిస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతుంది. ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు రజని.
Also Read: Tollywood : టెన్షన్ పడుతున్న తెలుగు హీరోయిన్.. కారణం ఇదే
ఓ వైపు సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్ లో పాల్గొంటూనే మరికొన్నీ సినిమాలను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే టాలీవుడు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథకు రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో యంగ్ డైరెక్టర్ సినిమాకు కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా గతేడాది రిలీజ్ అయిన ‘మహారాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు నిథిలన్ స్వామినాధన్. ఇటీవల ఈ దర్శకుడు రజనీని కలిసి ఓ కథను వినిపించగా అందుకు అయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఈ సినిమాను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిథి స్టాలిన్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై రాబోతుంది. ఇంతకు ముందెన్నడూ తీసుకోనటువంటి రెమ్యునరేషన్ నిధిలన్ తో సినిమా కోసం తీసుకోబుతున్నట్టు తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోన ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఇవే కాకుండా హెచ్ వినోద్ కూడా రజనీ కోసం ఓ కథ రెడీ చేశాడని కూడా తెలుస్తోంది.