Cruel woman: కర్ణాటక మంగళూర్లో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. 87 ఏళ్ల మామపై అమానుషంగా ప్రవర్తించింది. వాకింగ్ స్టిక్‌తో దారుణంగా కొట్టింది. తనను కొట్టొద్దని వృద్ధుడు ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, సదరు మహిళ రాక్షసిలా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఈ ఘటన మార్చి 9న జరిగింది.
సీసీటీవీ ఫుటేజీలో కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డ్(కేఈబీ) అధికారి ఉమాశంకరి అనే మహిళ, పద్మనాభ సువర్ణతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఆమె వృద్ధుడిని పదేపదే కొట్టడం కనిపిస్తుంది. తనను కొట్టవద్దని ఎంతగా ప్రాధేయపడినా కూడా దాడి చేస్తూనే ఉంది. పద్మనాభాన్ని నేలపైకి నెట్టేయడం, అతను కిందపడటం అంతా కెమెరాకు చిక్కింది. వృద్దుడు నేలపై నొప్పితో బాధపడుతున్నట్లుగా విజువల్స్ చూపించాయి. తీవ్రగా కొట్టిన తర్వాత సదరు మహిళ అక్కడ నుంచి బయటకు వెళ్లింది.
Read Also: Delhi: పెళ్లి చేసుకున్న గ్యాంగ్స్టర్లు.. అసలేం జరిగిందంటే..!
అయితే, మహిళ ఎందుకు అతడిని కొట్టిందనే వివరాలు బయటకు రాలేదు. తీవ్ర గాయాలైన పద్మనాభాన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గల్ఫ్ దేశంలో ఉంటున్న ఉమాశంకరి భర్త తన తండ్రిపై జరిగిన దాడిని చూసి షాక్ అయ్యారు. వెంటనే మూడబిద్రిలోని తన సోదరికి ఫోన్ చేసి ఉమాశంకరిపై ఫిర్యాదు చేయాల్సిందిగా కోరాడు. తండ్రిపై దాడి చేసినట్లు కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించారు. కంకనాడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఉమాశంకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
In a shocking incident, the #MangaluruPolice have arrested a woman for assaulting her father-in-law with a walking stick at #Kulshekar, #Mangaluru, on March 11.
The arrested has been identified as #Umashankari from Kulshekar.
According to the police, Umashankari, an officer in… pic.twitter.com/drqZPwCSi4
— Hate Detector 🔍 (@HateDetectors) March 11, 2024