Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఓట్ చోరీ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. “హెచ్ ఫైల్స్” అనే శీర్షికతో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికల రిగ్గింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీహార్‌లోని 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తుతూ…
జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 'మహా రోజ్‌గర్ మేళా' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపీ) రాహుల్ గాంధీపై మాజీ కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్ లో ఫుల్ క్రేజ్ ఉందని, ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ తేడాతో గెలుస్తారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని వీడియోలు పాకిస్తాన్ మీడియాలో, అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రమోద్ కృష్ణం ఈ వ్యాఖ్యలు చేశారు.