Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకల సందర్భంగా భాగ్యనగరంలో మద్యం షాపుల మూసివేతపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. పండుగ రోజుల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది.
దీనిలో భాగంగా 2026, ఆగస్టు 9వ తేదీ ఆదివారం రోజున నిర్ణీత పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968 లోని సెక్షన్ 20 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈ వైన్ షాపుల మూసివేత ఉత్తర్వులను ఆమోదించినట్లు తెలిపారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నిషేధం అమలులో ఉండే ప్రాంతాలు..
ఆగస్టు 9న ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో మద్యం షాపులు మూసి ఉంటాయి. అవి.. కూకట్పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల,
మేడ్చల్, చందానగర్.
ఈ ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయబడతాయి. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్లకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు.
పండుగ వేళ ప్రజాశాంతి, సురక్షిత వాతావరణం కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే సదరు యాజమాన్యాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. బోనాల వేడుకల వేళ ప్రజలు, భక్తులు పోలీసులకు సహకరించి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!