S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌లో తీవ్రవాదం గురించి వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదమే క్యాన్సర్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలనే తినేస్తోందని అన్నారు. ముంబైలోని 19వ నాని ఏ పాల్ఖివాలా స్మారక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత దశాబ్ధ కాలంగా భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి చెప్పారు.
Read Also: Kolkata Doctor Case: ‘‘ ఒక్కరు కాదు, నలుగురు నిందితులు’’.. ట్రైనీ డాక్టర్ తండ్రి సంచలన ఆరోపణ..
‘‘పాకిస్తాన్ మన పొరుగుదేశం. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోంది. ఆ క్యాన్సర్ ఇప్పుడు ఆ దేశాన్ని తినేస్తోంది. మొత్తం ఉపఖండ ప్రాంతం పాకిస్తాన్ ఈ విధానాన్ని విడనాడాలనే ఆసక్తిని కలిగి ఉంది’’ అని జైశంకర్ శనివారం అన్నారు. కీలమైన టెక్నాలజీలను డెవలప్ చేయడంతో భారత్ వెనకపడి ఉండకూడదని అన్నారు. ‘‘భారత్ వెస్ట్రన్ దేశాలకు చెందినది కాకపోవచ్చు, కానీ దాని వ్యూహాత్మక ప్రయోజనాలు పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదు’’ అని చెప్పారు.
భారతదేశం తనను తాను ‘విశ్వబంధు’గా లేదా అందరికీ స్నేహితుడిగా, ప్రపంచ వేదికపై నమ్మకమైన భాగస్వామిగా చూస్తుందని, స్నేహాలను పెంచడానికి, సమస్యలను తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉందని, కానీ భారత్ తన ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా జరుగుతుందని ఆయన చెప్పారు. భారతదేశ దౌత్య విధానాన్ని పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వ, పరస్పర ఆసక్తి అనే మూడు పదాల్లో చెప్పొచ్చని జైశంకర్ అన్నారు.