Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాప్ బ్యూటీ పూజా హెగ్డేకు సంబంధించిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. 18 ఏళ్ల వయసులో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సమయంలో తీసిన వీడియో అది. అందులో తనను తాను ముంబైకి చెందిన అమ్మాయిగా పరిచయం చేసుకుంది పూజ. కానీ పూజా కర్ణాటక నుండి వచ్చింది. ఆ సంగతి అలా ఉంచితే ఆ విడీలో చాలా బక్కపలుచగా, అమాయకమైన రూపంతో కనిపిస్తున్న పూజాను చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆ వీడియోలో ఉంది పూజా హెగ్డేనేనా అనే ఫీలింగ్ కలగక మానదు. కాగా మోడలింగ్ రంగంలో తన పయనాన్ని ప్రారంభించిన పూజా హెగ్డే, అక్కినేని నాగచైతన్య సరసన నటించిన ‘ఒక లైలా కోసం‘ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారారు. అనేక సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ పాత రేర్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత కొంత కాలంగా టాలీవుడ్ కు దూరమైన పూజా లాంగ్ గ్యాప్ తర్వాత శర్వానంద్ సినిమాతో ర ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
Also Read
#PoojaHegde – Pantaloons Femina Miss India Contestant at the age of 18 🤯 pic.twitter.com/BFlJpM42JA
— Movies4u Official (@Movies4u_Officl) August 3, 2026
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!