Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Scam Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ (SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ కావడం, సుదీర్ఘకాలం పాటు విదేశాల్లో తలదాచుకునేందుకు అవకాశాలు లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, అత్యున్నత నాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, వెంటనే సిట్ అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో వేరే మార్గం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా భారత్కు బయలుదేరాడు. ఆయనపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ (Lookout Circular) అమలులో ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకుని సిట్ బృందానికి అప్పగించారు. రాజ్ కేసిరెడ్డితో కలిసి ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. శంషాబాద్లో అదుపులోకి తీసుకున్న నిందితుడిని సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. మంగళవారం రోజున ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
Also Read
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!