హత్రాస్ ఘటనలో 123 మృతి చెందిన అనంతరం నారాయణ సాకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా తొలిసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు.
Rahul Gandhi: హత్రాస్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు పరామర్శించనున్నారు. రెండు రోజుల క్రితం హత్రాస్‌లో సత్సంగ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు.
హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు.
హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 123 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది.