హత్రాస్ ఘటనలో 123 మృతి చెందిన అనంతరం నారాయణ సాకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా పరారైన సంగతి తెలిసిందే. హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా తొలిసారి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. జులై 2 ఘటన తర్వాత చాలా బాధపడ్డామని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం హత్రాస్‌కు వెళ్లనున్నారు. హత్రాస్‌లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. కాంగ్రెస్ నేతలు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం.
హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు.
హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 123 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది.
Supreme Court grants bail to Kerala journalist Siddique Kappan: కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020 నుంచి జైలులోనే ఉన్నాడు సిద్ధిఖీ కప్పన్. ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిద్ధిఖీ కప్పన్. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్చ…