Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Keerthana Health Controversy: తమిళనాడు మంత్రి కీర్తన చుట్టూ వివాదం నెలకొంది. సీఎం విజయ్ లండన్ పర్యటనకు వెళ్లగా.. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కీర్తన ఎందుకు వెళ్లలేదంటూ విపక్షాలు ప్రశ్నించాయి. అయితే, నాలుగు రోజులుగా ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి అవసరం అవ్వడంతోనే మంత్రి లండన్ పర్యటనకు వెళ్లలేదని మంత్రి ఆధవ్ అర్జున వివరణ ఇచ్చారు. అయితే, ఆరోగ్య సమస్యకు కారణమేంటంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పీరియడ్స్ కారణంగానే కీర్తన లండన్ వెళ్లలేదంటూ కొందరు ప్రచారం చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ప్రచారాన్ని టీవీకే ఎమ్మెల్యే కనిమొళి శాంతోష్ తీవ్రంగా ఖండించారు. గతంలో భుజానికి అమర్చిన ప్లేట్లో సమస్య రావడంతో సెప్టెంబర్ 10న కాలర్‌బోన్ శస్త్రచికిత్స జరిగినట్లు వెల్లడించారు. మంత్రి పీఏ రవితేజ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. నొప్పితోనే సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కీలక సమావేశాలకు హాజరై.. 10న శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిపారు. వైద్యులు 20 రోజుల విశ్రాంతి సూచించినా.. ఐదు రోజులకే సచివాలయానికి వచ్చి అధికారిక కార్యక్రమాలను పర్యవేక్షించారని పేర్కొన్నారు.
అయితే, కీర్తనకు ఎదురైన ఆరోగ్య సమస్యపై స్పష్టత ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో వివిధ రకాల చర్చలు మొదలయ్యాయి. కొందరు ఆమె లండన్ పర్యటనకు దూరం కావడానికి పీరియడ్స్ కారణమా అంటూ ప్రశ్నలు, విమర్శలు చేశారు. అయితే ఈ ప్రచారాన్ని టీవీకే ఎమ్మెల్యే కనిమొళి శాంతోష్ తీవ్రంగా ఖండించారు. మహిళల ఆరోగ్య పరిస్థితిని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. కీర్తనకు గతంలో భుజానికి అమర్చిన ప్లేట్లో సమస్య ఏర్పడటంతో కాలర్‌బోన్‌కు శస్త్రచికిత్స జరిగినట్లు కనిమొళి శాంతోష్ వెల్లడించారు. సెప్టెంబర్ 10న ఈ శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు. కీర్తనను ఆస్పత్రిలో స్వయంగా కలిసినట్లు, వైద్యులు సుమారు 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ ఆమె త్వరగానే విధులకు తిరిగి వచ్చారని కనిమొళి శాంతోష్ పేర్కొన్నారు.
Also Read
- Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
- Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
- CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
- CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మంత్రి కీర్తన వ్యక్తిగత సహాయకుడు రవి తేజ వెల్లడించిన వివరాల ప్రకారం.. భుజానికి గతంలో అమర్చిన ప్లేట్లో సమస్యలు తలెత్తడంతో దానిని అత్యవసరంగా తొలగించాలని వైద్యులు సూచించారు. సెప్టెంబర్ 8న నొప్పి ఉన్నప్పటికీ హ్యుందాయ్ హెచ్డీ బృందంతో పూర్తిస్థాయి సమావేశానికి కీర్తన హాజరయ్యారని, మరుసటి రోజు కజకిస్థాన్ ప్రతినిధి బృందంతో సమావేశంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఆ రెండు సమావేశాలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 10న భుజంలోని ప్లేట్ తొలగించేందుకు శస్త్రచికిత్స చేసినట్లు రవి తేజ వెల్లడించారు. రెండు గంటలకు పైగా శస్త్రచికిత్స కొనసాగిందని, రెండు రోజుల తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. వైద్యులు 20 రోజుల పూర్తి విశ్రాంతి సూచించినప్పటికీ ఐదు రోజుల్లోనే కీర్తన సచివాలయానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు.
విధులకు తిరిగి వచ్చిన తర్వాత కూడా కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు, ఎంవోయూలపై సంతకాలు, అధికారులతో సమన్వయం వంటి కార్యక్రమాలను కీర్తన కొనసాగించినట్లు రవి తేజ తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ లండన్ నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఎంవోయూలు, అధికారుల సమావేశాలపై ఆమె వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా, ముఖ్యమంత్రి విజయ్ లండన్ పర్యటనకు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన గైర్హాజరు కావడం చుట్టూ మొదలైన చర్చకు ఆమెకు జరిగిన భుజం శస్త్రచికిత్స వివరాలు వెలుగులోకి రావడంతో వివరణ లభించింది. కీర్తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలను కనిమొళి శాంతోష్ ఖండిస్తూ, మహిళల ఆరోగ్యాన్ని గౌరవంగా చూడాలని కోరారు.
తాజావార్తలు
-
Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
-
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
-
Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
-
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!