రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చర్చలు జరుపుతున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. అయినా ప్రయోజనం లభించలేదు. ఇక ట్రంపే స్వయంగా రంగంలోకి దిగారు.
Vizag MLC Election: విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కూటమి నేతల కీలక సమావేశం అయింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్న అధిష్ఠానం నియమించిన కమిటీ.. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన నివేదిక ఆధారంగా పోటీపై ఎన్డీయే కూటమి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ సమాయత్తం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో.. తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మంగళవారం వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి…
ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్- 2 వద్ద మంత్రుల కమిటీతో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనున్నారు. కాగా, పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
నేడు రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటల నుంచి రాజమండ్రి ఏవీఏ రోడ్ లో ఉన్న జనసేన పార్లమెంటు కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి.
ప్రాణ ప్రతిష్ట వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) ధరంపాల్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌లోని సభ్యులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ సంవత్సరం జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది రానున్న లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ముఖ్య నేతలతో కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గత 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపి ఓడిపోయిన సుమారు 160 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకోవడంపై చర్చిస్తున్నారు.