New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో అర్థరాత్రి బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో వ్యవహారించాల్సిన వ్యూహాంపై చర్చించడానికి బీజేపీ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. సుమారు 5 గంటలపాటు సమావేశం కొనసాగినట్టు తెలిసింది.
Read also: Cheapest Electric Scooters: ధర 59 వేలు, 85 కిలోమీటర్ల ప్రయాణం.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటికే దేశంలోని 18 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కోసం తగిన వ్యూహాం రూపొందించడం కోసం ప్రణాళికలను తయారు చేయనుంది. అందులో భాగంగానే బుధవారం అర్థరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీ కొద్ది రోజుల క్రితం అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనను ముగించుకొని ఇండియా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుసగా సమావేశాలను నిర్వహించుకుంటూ వస్తున్నారు.. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సైతం ప్రధాని మాట్లాడారు.
ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల జాబితా తయారు చేయడం, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి చర్చించినట్టు తెలిసింది. ఎన్నికల అంశంతోపాటుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరపాలని కూడా సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్టు బీజేపీ సీనియర్ నేత తనకు తెలిసిన మీడియా మిత్రులతో చెప్పారు. 2024కు సంబంధించిన బీజేపీ తొలిజాబితాను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read also: Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంఓ ఈ ఏడాది చివర్లో జరగనున్న తదుపరి రాష్ట్ర ఎన్నికల కోసం బీజేపీ తన ప్రచార విధానాన్ని మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. నాలుగు కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో రివాల్వింగ్ డోర్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకోవాలని, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లో ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.