మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోవడం.. తక్కువ సీట్లు రావడంతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థుల ఖరారు, అగ్రనేతల నేతల ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చ కొనసాగింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో అర్థరాత్రి బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో వ్యవహారించాల్సిన వ్యూహాంపై చర్చించడానికి బీజేపీ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు.
తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. కాంగ్రెస్ పోటీ చేస్తోంది రెండు చోట్లే. మరి.. మిగిలిన నాలుగు స్థానాల్లో హస్తం వ్యూహం ఏంటి? పోటీకి దూరంగా ఉన్న జిల్లాల్లో ఎవరిపై గురి పెడుతోంది? లెట్స్ వాచ్..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరుచోట్లా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలిచే బలం ఉన్న పార్టీ సైతం ముందు జాగ్రత్త పడుతోంది. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల…
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి షణ్ముఖ్, సిరి ఒక్కటిగానే ఏ గేమ్ అయినా ఆడుతున్నారు. ఒకరికి ఒకరికి సాయం చేసుకోవడం లేదని మిగిలిన ఇంటి సభ్యులతో బుకాయించినా, కొన్ని సందర్భాలలో వీరిని నిలదీసినప్పుడు ‘అది మా స్ట్రేటజీ’ అంటూ తప్పించుకునే వారు. ఈ ఇద్దరికీ ఆ తర్వాత జెస్సీ జత కలిశాడు. ముగ్గురూ కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారంటూ కొందరు వీరికి ముద్దుగా త్రిమూర్తులు అనే పేరూ పెట్టారు. అయితే, రెండు వారాల క్రితం…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు…
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి? ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకుందా? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ శిబిరం ఎత్తుగడలను ఈ స్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌పై పూర్తిస్థాయి పట్టుకోసం దృష్టి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఉపఎన్నిక…
టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు. ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు…