Crime News: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆవిడపు రాజన్న అనే వ్యక్తిని తనయుడు సాయి సిద్ధార్థ్ (సిద్దు) హత్య చేశాడు. ఈ హత్య స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సాయి సిద్ధార్థ్ తన తండ్రిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సిద్ధార్థ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, ఈ ఘోరానికి సిద్ధార్థ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Meerpet Murder Case: మీర్పేట్లో భార్య హత్య కేసు.. నేడు కోర్టు ముందుకు నిందితుడు!
పూర్తి స్థాయి విచారణ చేపడుతున్న పోలీసులు, సాయితో పాటు అనుమానితులైన మరో ఇద్దరిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు, ఈ కుట్ర వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన కుటుంబ కలహాలు ఎంతటి ఘోరాలకు దారి తీస్తాయనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Also Read: Fire Incident: టిఫిన్స్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు