Gautam Adani: అదానీ గ్రూపుపై అమెరికా లంచం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు లంచం, మోసానికి పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్టీ, SECIతో 12 GW సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని అభియోగపత్రంలో ఆరోపించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది. ఈ చెల్లింపుల్లో ఏపీకి ఎక్కువ వాటా లభించినట్లు సమాచారం.
అయితే, ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అదానీకి, ప్రధాని మోడీకి సంబంధాలు ఉన్నాయని, అతడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలు తిరిగి కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మెడకే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అభియోగాలు మోపిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, విపక్ష పార్టీల పాలనలోనే ఉన్నాయి. ఈ ఒప్పందాలు జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే, ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేపీ పాలన ఉంది. ఈ నేపథ్యంలో రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, ముఖ్యంగా విపక్షాల దాడిని తట్టుకునేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉంది.
Read Also: Stock Market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
1) ప్రత్యర్థి పార్టీలపై బీజేపీ ఆరోపణ: నేరారోపణలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు లేరు. ఆ ప్రభుత్వాలు లంచాలను ఎందుకు అనుమతించాయి..? అని బీజేపీ ప్రతిపక్షాలపై విరుచుకుపడే అవకాశం ఉంది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల పాత్రపై సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు అడుగొచ్చు.
2) యూఎస్ నేరారోపణలో కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఇంకా ఆరోపనలు రుజువు కాలేదని, నేరం రుజువు అయ్యేంత వరకు నిందితులు నిర్దోషులగా భావిస్తారని బీజేపీ చెబుతుంది.
3) నేషనల్ వర్సెస్ ఇంటర్నేషనల్ రాజకీయాలు: భారతదేశ కంపెనీలపై దాడి చేయడానికి విదేశీ నివేదికలపై ప్రతిపక్షాలు ఆధారపడటంపై బీజేపీ ప్రతిపక్షాలను విమర్శించొచ్చు. ఇలాంటి నేరోరపణలను భారతీయ న్యాయచట్టాల పరిధిలో పరిష్కరించాలని వాదించొచ్చు. విదేశీ ప్రభుత్వాలు భారత దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకునే విషయాన్ని లేవనెత్తవచ్చు. భారతదేశంలో అవినీతికి పాల్పడినందుకు అమెరికన్ కంపెనీలపై భారతీయ న్యాయస్థానాలు ఇదే విధంగా అభియోగాలు మోపవచ్చని బీజేపీ చెబుతోంది.
4) ఆరోపణల సమయం: నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు ముందే అదానీపై ఆరోపణలు వచ్చాయి. అయితే, ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రాజకీయ ప్రేరేపిత వ్యూహాంలో భాగమని బీజేపీ ఈ అభియోగాలను ఖండిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు తీసుకునే సమయం కూడా ఇక్క చర్చనీయాంశంగా మారింది.