Stock Market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- ఒక్కరోజు లాభాలకు బ్రేక్
- భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- అదానీ గ్రూప్‌పై అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపణలతో కుదేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమై గ్రీన్‌లో ముగిసింది. మళ్లీ ఒక్కరోజులేనే ఆ ఉత్సాహం ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు.. అదానీ గ్రూప్‌పై అమెరికా ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలతో మార్కెట్ కుదేలైంది. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలానే కొనసాగింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 422 పాయింట్లు నష్టపోయి 77, 155 దగ్గర ముగియగా.. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 23, 349 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.50 దగ్గర తాజా రికార్డు స్థాయిలో ముగిసింది.
ఇది కూడా చదవండి: Tragedy: విషాదం.. 6 నెలల బాలుడితో పాటు ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు రావడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ అత్యధికంగా నష్టపోయిగా.. పవర్ గ్రిడ్ కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభాపడ్డాయి .బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజి, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యు బ్యాంక్, మీడియా, మెటల్ 1-2 శాతం క్షీణించగా, రియల్టీ ఇండెక్స్ 1 శాతం లాభపడగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: IRCTC Punya Kshetra Yatra: బంపర్ ఆఫర్.. 10 రోజుల పుణ్యక్షేత్రాల టూర్ అనౌన్స్ చేసిన ఐఆర్సిటిసి
ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అదానీ గ్రూప్‌పై అభియోగాలు మోపింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ పేర్కొంది. బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు