PM Modi: భగవాన్ హనుమాన్ స్పూర్తితో దేశంలోని అవినీతి, బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలు, శాంతిభద్రతల సవాళ్లపై పోరాడలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ హనుమంతుడిలా దేశం కోసం ధృడసంకల్పం, దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని, పార్టీ కార్యకర్తలు త్యాగం, అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
Read Also: Etela Rajender: లీకేజీతో ఈటలకు లింకులు.. నోటీసులు జారీచేసిన పోలీసులు
ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం మరియు రక్షణ వంటి వివిధ రంగాలలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం బీజేపీ పని చేస్తుందని అన్నారు. ‘‘సబ్ కా సాథ్, సబ్ కా హాత్, సబ్ కా వికాస్’’ అనే మంత్రాన్ని విశ్వసిస్తోందని ఆయన అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 14 వరకు బీజేపీ పార్టీ ప్లాన్ చేసిన విధంగా సామాజిక సామరస్య ప్రచారంలో పాల్గొనాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
‘‘నేషన్ ఫస్ట్’’ అనేది బీజేపీ పాలసీ అని అన్నారు. రాబోయే 25 ఏళ్లు మనకు విజన్ ఉండాలని, మన పార్టీ కార్యకర్తలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా శిక్షణ ఇవ్వాలని అని అన్నారు. భారతదేశం ఇప్పుడు హనుమంతుడిలో దాగి ఉన్న శక్తి వలే తన సామర్థ్యాన్ని తెలుసుకుందని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రదేశాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రదర్శించారు.