Etela Rajender: 10 th క్లాస్ పేపర్ లీకేజ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అది రానురాను బీజేపీ మెడలకు చుట్టుకుంటుంది. టెన్త్ పేపర్ లీకేజీకి ఎవరు పాల్పడ్డారో తెలుసుకుంటున్న పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులే టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో భాగమవడంతో ఒక్కొక్కరిని అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నారు. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కాగా.. ఇప్పుడు ఇందులో ఈటెల రాజేందర్ పేరు కూడా చేరడంతో ఈకేసు కీలకంగా మారింది. దీంతో ఇవాళ ఈటెల రాజేందర్ ను నోటీసులు జారీ చేశారు అధికారులు.
Read also: Cunning Friend : ఫ్రెండ్ అని నమ్మితే.. పెళ్లికి పనికి రాకుండా చేశాడు
10 th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు. కమలాపూర్ లో పేపర్ లీకేజ్ పై ఈటెల స్టేట్మెంట్ వరంగల్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ప్రశాంత్ పేపర్ ను పంపించినట్లు పోలీసులు గుర్తించడంతో సంచలనంగా మారింది. 10 పేపర్ లీకేజ్ కు హుజురాబాద్ నియోజకవర్గంనే ఎందుకు ఎంచుకున్నారన్న దాని పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజారాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని కూడా ఈటలకు పంపినట్లు ఆధారాలు ఉండడంతో పదో తరగతి పేపర్ లీక్ కేసులో పోలీసులు ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఈటల వాంగ్మూలాన్ని వరంగల్ పోలీసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్ తో పాటు , ఆయన పీఏలకు వరంగల్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. పోలీసుల నోటీసులకు ఈటల రాజేందర్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.
Read also: Hindu temple vandalised: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. నాలుగు నెలల్లో రెండో సంఘటన
10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ ని పోలీసులు కరీంనగర్ జైలులో ఉంచారు. బండి సంజయ్ రిమాండ్ ను సవాల్ చేస్తూ బీజేపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు CJ విచారణ చేపట్టన్నారు. కాగా.. పరీక్ష సమయానికి ప్రశ్నపత్రం బయటకు వచ్చి సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించడంతో పోలీసులు సంజయ్‌ను రోల్ ప్లేయర్‌గా అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంజయ్‌ను బుధవారం హన్మకొండ జిల్లా చీఫ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. సంజయ్ , ప్రశాంత్ ను వారం రోజులపాటు కస్టడీ కావాలంటూ వరంగల్ పోలీసులు కోర్ట్ లో పిటిషన్ వేయనున్నారు. ఏ1- బండి సంజయ్ కుమార్ (51), ఏ2- బూరం ప్రశాంత్ (33), ఏ3 – గుండెబోయిన మహేశ్ (37), ఏ4- మైనర్, ఏ5- శివగణేశ్ (19), అరెస్టయిన నిందితులు కాగా.. ఇక పరారీలో ఏ6- పోగు సుభాష్ (41), ఏ7- మైనర్, ఏ8-మైనర్, ఏ9- పెరుమాండ్ల శ్రామిక్ (నాని) (20), ఏ10- పోతబోయిన వర్షిత్ (చందు)(19) నిందితులు ఉన్నారు వీరికోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
IPL 2023: కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఏబీడీ