Congress: 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అమెరికా నిఘా సంస్థ CIA, ఇజ్రాయిల్ గూఢచార ఏజెన్సీ మొసాద్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ జర్నలిస్ట్ కేట్కర్ మాట్లాడుతూ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు, ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 206 సీట్లు గెలుచుకుందని అన్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కాంగ్రెస్ 250 సీట్లు గెలుచుకుని అధికారం…
Bangladesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయ్యారు. అయితే, షేక్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ సంచలన ఆరోపణలు చేశారు. హసీనాను పదవి నుంచి దించడానికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా సహాయం చేశారని అన్నారు. అమెరికా సీఐఏ ఈ మొత్తం…
Pakistan: పాకిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
Gurpatwant Singh Pannun: మొన్నటి వరకు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా-ఇండియాల మధ్య వివాదంగా మారితే.. ప్రస్తుతం మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం ఇప్పుడు భారత్-అమెరికాల మధ్య వివాదంగా మారింది. పన్నూను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా నుంచి ఆరోపణలు వస్తున్నాయి.