Airtel: కస్టమర్లకు ఎయిర్ టెల్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, రూ. 1999 రీఛార్జ్ పై 336 రోజుల పాటు డేటా లేకుండా అపరిమిత కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ లు లభిస్తాయని ప్రకటించింది. గతంలో ఈ ప్లాన్లపై కొన్ని జీబీల డేటాను కూడా ఎయిర్ టెల్ కంపెనీ అందించేది. కానీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలతో భారత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్ టెల్ వాయిస్, SMS-మాత్రమే ప్రీపెయిడ్ ప్లాన్‌లను మాత్రమే ఇప్పుడు ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌లు ఏవీ ప్రారంభించనప్పటికి.. TRAI ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న ప్లాన్లను సవరించింది. దీనిపై స్పందించిన
Airtel సంస్థ వెబ్సైట్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల డేటా ప్లాన్ మిస్ అయినట్లు తెలిపింది.
Airtel Statement: “As per Airtel officials, it was a technical glitch due to which the plans were visible on the website. The same has been taken down from the website now.”