Bengaluru: బెంగళూర్ లో హృదయవిదారక ఘటన జరిగింది. తల్లి మరణించినా, నిద్ర పోతుందని భావించిన పిల్లాడి అమాయకత్వాన్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అసలు అమ్మ ఎందుకు లేవడం లేదో తెలియదు, మాట్లాడదు, కదలదు, తనకు అన్నం పెట్టదు.. అయినా అమాయకంగా తన తల్లి నిద్ర పోతుందని భావించాడు ఆ పిల్లాడు. తల్లి మరణించినా రెండు రోజలు పాటు మృతదేహం పక్కనే నిద్రించాడు.
Read Also: Russia: మేం ఒంటరి కావడం లేదు.. మీరే అవుతున్నారు.. పాశ్చాత్య దేశాలపై రష్యా ఆగ్రహం
11 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తల్లి పక్కనే రెండు రోజులుగా నిద్రిస్తున్నాడడు. బీపీ, షుగర్ తో బాధపడుతున్న అన్నమ్మ(44) బెంగళూర్ లోని ఆర్టీనగర్ లోని తన ఇంట్లో నిద్రలోనే మరణించింది. అయితే తల్లి చనిపోయిన విషయం తెలియని తన స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళ్లి, వారితో కలిసి భోజనం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు.
అయితే గత రెండు రోజుల అమ్మ నాతో మాట్లాడటం లేదని, నిద్రపోతుందని స్నేహితులతో చెప్పాడు బాలుడు. ఈ విషయాన్ని బాలుడి స్నేహితులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా మహిళ మరణించి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, న్యాయపరమైన లాంఛనాలను పూర్తిచేసి అంత్యక్రియలు నిర్వహించారు.