Heart Break Incident : వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం పర్వత్పల్లి గ్రామంలో ఉన్న అంజనేయ స్వామి దేవాలయం వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కొండముచ్చు చింత చెట్టు మీద నుంచి కాలు జారి కిందపడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. మృతి చెందిన కొండముచ్చుకు హిందూ సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు ఈ ఘటనపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కొండముచ్చుకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు…
కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తమ నివాసాలుగా పైకప్పులపై నివసించవలసి వస్తోంది. ఇక్కడ ఓ హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది.
Bengaluru: బెంగళూర్ లో హృదయవిదారక ఘటన జరిగింది. తల్లి మరణించినా, నిద్ర పోతుందని భావించిన పిల్లాడి అమాయకత్వాన్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అసలు అమ్మ ఎందుకు లేవడం లేదో తెలియదు, మాట్లాడదు, కదలదు, తనకు అన్నం పెట్టదు.. అయినా అమాయకంగా తన తల్లి నిద్ర పోతుందని భావించాడు ఆ పిల్లాడు. తల్లి మరణించినా రెండు రోజలు పాటు మృతదేహం పక్కనే నిద్రించాడు.