Karnataka: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇటీవల కాలంలో ఇంతలా ఓడిపోవడం ఈ పార్టీకి ఇదే తొలసారి. ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 136, బీజేపీ 65 స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు.