Namaz: ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) క్యాంపులోని విద్యార్థులతో ఓ ప్రొఫెసర్ బలవంతంగా నమాజ్ చేయించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో 8 మందిపై ఏప్రిల్ 26న ఎఫ్ఐఆర్ నమోదైంది.