Asaduddin Owaisi: టిప్పు సుల్తాన్ చరిత్రను తుడిచేయలేరు.. కండోమ్లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi comments on Tippu Express name change: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘టిప్పు ఎక్స్ప్రెస్’ పేరును ‘వడయార్ ఎక్స్ప్రెస్’గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైల్వే మంత్రిత్వ శాఖ బెంగళూర్ నుంచి మైసూర్ వెళ్లే ట్రైన్ టిప్పు ఎక్స్ప్రెస్ పేరును వడయార్ ఎక్స్ప్రెస్ గా మార్చింది. బీజేపీ యజమానులు అయిన బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడినందుకు వారికి కోపం తెప్పించిందని అందుకు రైలు పేరు మార్చారని దుయ్యబట్టారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ మూడు యుద్ధాలు చేశాడనే కోపం కాషాయ పార్టీలో ఉందని ఎద్దేవా చేశారు. టిప్పు సుల్తాన్ వారసత్వాన్ని బీజేపీ ఎప్పటికీ తుడిచివేయలేదని అన్నారు. టిప్పు బతికుండగా బ్రిటీష్ వారిని భయపెట్టారు. ఇప్పుడు బ్రిటిష్ బానిసలను భయపెట్టారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా ఈ ఏడాది జూలైలో టిప్పు ఎక్స్ప్రెస్ పేరును మార్చాలని రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ రైలు పేరు మార్చింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ట్విట్ చేస్తూ.. శుక్రవారానికి శుభవార్త.. ఇప్పుడు టిప్పు ఎక్స్ప్రెస్ బదులుగా వడయార్ ఎక్స్ప్రెస్ మీకు సేవలు అందిస్తుందని.. అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ చర్యలను ప్రశంసించారు. ఇది కర్ణాటక రాష్ట్ర సంపన్నమైన వారసత్వం, అద్భుతమైన చరిత్రకు గుర్తింపు అని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వడయార్ రాజవంశ చేసిన కృషిని గుర్తిస్తూ రైలు పేరును మార్చారు.
BJP govt renamed Tippu Express to Wodeyar Express. Tipu irks BJP because he waged 3 wars against its British masters. Another train could have been named after Wodeyars. BJP will never be able to erase Tipu’s legacy. He scared British while alive & scares British slaves even now pic.twitter.com/vsFJi5fR1D
— Asaduddin Owaisi (@asadowaisi) October 9, 2022
ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లిం జనాభా పెరగడం లేదని.. పడిపోతుందని.. కండోమ్ ఎక్కువగా వాడుతున్నది ఎవరు..? మనమే అని వ్యాఖ్యానించారు. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరని అన్నారు. దేశంలో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. ముస్లింలు బహిరంగ జైలులో బతుకుతున్నట్లు అనిపిస్తోందని.. ముస్లిం కన్నా రోడ్డు పక్కన కుక్కకే ఎక్కవ గౌరవం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Oneplus 16 Launched: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 120X జూమ్.. వన్ ప్లస్ నుంచి మొబైల్ లాంచ్..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!