Online Financial Fraud: భారతదేశంలో ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆన్‌లైన్ ఆర్థిక మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్ మోసాలపై లోకల్ సర్కిల్స్ తాజాగా ఓ సర్వే నివేదికను వెల్లడించింది. ఇండియాలో దాదాపుగా 39 శాతం కుటుంబాలు ఆన్‌లైన్ ఆర్థిక మోసాల్ని అనుభవించినట్లు సర్వే వెల్లడించింది. దాదాపు 23 శాతం మంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ మోసాన్ని అనుభవించినట్లు తెలిపారు. 10 శాతం మంది ఏటీఎం కార్డు గురైనట్లు, మరో 10 శాతం బ్యాంక్ అకౌంట్ మోసానికి గురైనట్లు తెలిపారు. మొత్తంగా 39 శాతం భారతీయ కుటుంబాలు గత మూడేళ్లలో ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నామని, వారిలో 24 శాతం మంది మాత్రమే తమ డబ్బులను తిరిగి పొందినట్లు లోకల్ సర్కిల్స్ మంగళవారం ఓ నివేదికలో పేర్కొంది.
ఈ సర్వేలో 23 శాతం మంది క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలను అనుభవించినట్లు తెలుపగా, దీంట్లో 13 శాతం మంది ఆన్ లైన్ సైట్లలో అమ్మడం, కొనుగోలు చేయడం వంటివాటితో మోసపోయినట్లు వెల్లడించారు. 10 శాతం మంది ఏటీఎం కార్డ్ మోసాల గురించి తెలిపారు. సర్వేలో పాల్గొన్న 30 శాతం మంది ఆర్థిక మోసాలకు గురైన కుటుంబాల్లో ఒక సభ్యుడిగా ఉన్నానని వెల్లడించారు. మరో 9 శాతం మంది తమ కుటుంబాల్లో చాలా మంది గత మూడేళ్లలో ఆర్థిక మోసాలకు గురైనట్లు తెలిపారు. 57 శాతం మంది ఈ ఆన్ లైన్ మోసాలను నుంచి తమ కుటుంబాలు తప్పించుకున్నందకు సంతోషం వ్యక్తం చేయగా.. 4 శాతం మంది వారి స్పందనను క్లీయర్ గా తెలియజేయలేదు.
Read Also: Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్‌లో ఉండేది
భారతదేశంలో 331 జిల్లాల్లో ఉన్న కుటుంబాల నుంచి 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు టోటల్ గా ఈ సర్వేకు దాదాపుగా 32,000 మంది పాల్గొన్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. ఇందులో 39 శాతం మంది టైర్ 1 సిటీల నుంచి 35 శాతం మంది టైర్ 2 సిటీల నుంచి 26 శాతం మంది టైర్ 3,4 సిటీలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారుగా వెల్లడించింది. కేవలం 24 శాతం అంటే 11,305 మంది తాము మోసపోయిన డబ్బును పొందినట్లు తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదుకు ఎలాంటి పరిష్కారం లభించలేదని చెప్పారు.
ఆర్థిక మోసాలకు నష్టపోయే కుటుంబాల శాతం 2022 తో పోలిస్తే 2023లో స్వల్పంగా తగ్గింది. గత ఏడాది క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలు మోసాలు 18 శాతం ఉంటే ప్రస్తుతం 23 శాతానికి చేరాయి. ఇక్కడ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆర్థిక మోసాలకు గురైన కుటుంబాలు తిరిగి తమ డబ్బులను పొందే శాతం 2022లో 17 శాతం ఉంటే 2023లో 24 శాతానికి పెరిగింది.