ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్ అయ్యాడు..!! అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరొకరు మోసపోకుండా ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల ఆశ చూపి అమాయకులను విదేశాలకు పంపాడు. ఇదీ చాలదన్నట్టు స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అడ్డంగా బుక్కై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు.
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోక్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. కొలంబోలోని మడివెల, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుంచి వారిని గురువారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 135 మొబైల్స్, 57 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్‌ఎస్‌పి నిహాల్ తల్దువా తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. అనుమానంతో నెగొంబోలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు…
Online Financial Fraud: భారతదేశంలో ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆన్‌లైన్ ఆర్థిక మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్ మోసాలపై లోకల్ సర్కిల్స్ తాజాగా ఓ సర్వే నివేదికను వెల్లడించింది. ఇండియాలో దాదాపుగా 39 శాతం కుటుంబాలు ఆన్‌లైన్ ఆర్థిక మోసాల్ని అనుభవించినట్లు సర్వే వెల్లడించింది.