Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- సమాజంలో భాగమేనని వెల్లడి
- ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వలింగ వివాహాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కులు కూడా సమాజంలో భాగమేనని.. వారికి గౌరవప్రదంగా కలిసి జీవించే హక్కు ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బంధాన్ని ‘వివాహం’గా పిలవకుండా.. కలిసి జీవించేందుకు ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థను రూపొందించవచ్చని సూచించారు. ముంబైలో ఐఐఎంయూఎన్ నిర్వహించిన యువజన సదస్సులో జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎల్జీబీటీ అయినా.. మరెవరైనా వారు మన సమాజంలో భాగమే. వారిని సమాజం అంగీకరించే సంప్రదాయం మన దేశంలో ఉంది’’ అని అన్నారు. భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. మన సంప్రదాయంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేందుకు ఏర్పడిన సౌకర్యం మాత్రమే కాదని.. అది కుటుంబ వ్యవస్థకు పునాది అన్నారు. కుటుంబం సమాజానికి మూల యూనిట్ అని.. మంచి పౌరులను తీర్చిదిద్దేది కుటుంబమేనని వివరించారు.
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
స్వలింగ జంటలు కలిసి జీవించేందుకు చట్టబద్ధమైన వ్యవస్థను రూపొందించవచ్చని.. కానీ దానిని ‘‘సేమ్ సెక్స్ మ్యారేజ్’’గా పిలవకూడదని అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహం అని కాకుండా స్వలింగ భాగస్వాములు కలిసి జీవించేందుకు ఒక ప్రత్యేక చట్టపరమైన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాపై హెచ్చరిక
సోషల్ మీడియా వినియోగంపై కూడా మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం చట్టాలు తీసుకురావడం వల్ల సమస్యలు పరిష్కారం కావని.. సమాజం తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని నిజమని నమ్మకూడదు. ప్రస్తుతం కృత్రిమ మేధ (AI) సాయంతో నకిలీ వీడియోలు, తప్పుడు వ్యాఖ్యలు సృష్టించడం సాధ్యమవుతోంది. కాబట్టి అధికారిక వనరుల ద్వారా ధృవీకరించిన తర్వాతే సమాచారాన్ని నమ్మాలి. సోషల్ మీడియా వినియోగంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి.’’ అని సూచించారు.
జెన్-జీ యువతపై ప్రశంసలు
ఇటీవల విద్యార్థుల నిరసనలపై స్పందిస్తూ జెన్-జీ యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘జెన్-జీ నిరసనలు చేస్తే వారు దేశ వ్యతిరేకులు కాదు. వారు మన తర్వాతి తరం. వారి సమస్యలు నిజమైనవే. భారత విద్యా వ్యవస్థలో ఇంకా ఎన్నో మార్పులు అవసరం. అందుకే వారు తమ గళాన్ని వినిపిస్తున్నారు.’’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు కూడా ఏకాభిప్రాయం సాధించే ఒక మార్గమని పేర్కొన్న ఆయన… ఆందోళనలు విభజనలు సృష్టించడానికి కాకుండా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే జరగాలని సూచించారు. యువత ప్రశ్నలు అడగడం మంచి పరిణామమని, వారి సందేహాలకు తార్కిక సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని మోహన్ భగవత్ అన్నారు.
- Tags
- LGBTQ+
- Mohan Bhagwat
- RSS
- RSS Chief
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!