Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రోజు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడికి పాల్పడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో దాడి ఇది. దాడి జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలు పంపినట్లు సమాచారం. కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. పూంచ్‌లోని సురన్‌కోట ప్రాంతంలోని డేరా కీ గలీ(డీకేజీ) ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.