Pallavi Prashanth Bail Petition at Nampally Court: బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ తన వాదనలు వినిపించారు. అక్కడ జరిగిన గొడవకు పల్లవి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి అక్కడ జనాలు గుమిగూడి ఉన్నారని అన్నారు. పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చింది రాత్రి 10:30 గంటల తరువాతే అని అన్నారు. మధ్యాహ్నం నుంచి పోలీసులు అక్కడే ఉండి మాబ్ ను కంట్రోల్ చేయలేక పోయారని ఈ విషయంలో సంబంధం లేకున్నా పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
DEVIL Censor : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సెన్సార్ రిపోర్ట్
పల్లవి ప్రశాంత్, అతని సోదరుడికి బెయిల్ మంజూరు చేయాలని వాదించాడు. ఇక పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చాకే వారి అనుచరులు గొడవ చేశారని అన్నారు. డీసీపీ స్థాయి అధికారి అక్కడికి వచ్చి బ్రతిమలాడినా అక్కడ గుమి కూడిన జనాలు వినలేదని అన్నారు. అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని, పోలీస్ వాహనాలు పై దాడి చేశారని అన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వారని, ప్రస్తుతం ఏ 3 ఇంకా పరారీలో ఉన్నాడని అన్నారు. వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది.