బీజేపీ మాజీ అదికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారి తీసింది. అయితే నుపుర్ శర్మకు మద్దతు తెలిపిన కారణంగా మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 21న తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వస్తున్న సమయంలో ఉమేష్ కోల్హేని కత్తితో పొడిచి హత్య చేశారు.
ముంబైలోని నటుడు షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్ దీపావళికి ముందు దీపాలతో అలంకరించారు. దీనికి కారణం లేకపోలేదు. అతని కుటుంబం వేడుక చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యారు. ఆర్యన్‌తో పాటు మరో ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అక్టోబర్ 2న ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుండి అరెస్టు చేసింది. డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో…