కొన్ని ఊహించని ఘటనలు.. తమ కళ్ల ముందు జరిగిన ప్రమాదాలు కొందరి మనస్సును పూర్తిగా మార్చేస్తాయి.. ఎన్నిసార్లు చెప్పినా.. చాలా సార్లు దొరికిపోయినా.. ఎందరో హెచ్చరించినా మనసు మార్చుకోని ఓ బైక్ రేసర్.. ఓ ఘటనను చూసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు.. మారడంటే.. తాను ఒక్కడే మారడం కాదు.. చాలా మందిని మార్చే ప్రయత్నం మొదలు పెట్టాడు.. ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చాడు.. సిగ్నల్స్ వద్ద ప్రచారం చేయడం మొదటు పెట్టాడు.. ఇంతలా మారిపోయిన ఆ బైక్ రేసర్ ఎవరు? ఎందుకు అలా మారిపోయాడు అనే విషయాల్లోకి వెళ్తే…
Read Also: Tollywood: ఓరి దేవుడా… ఈ వారం ఇన్ని సినిమాలా!?
చెన్నై సిటీలో పలుమార్లు రేసింగ్‌తో పాటు బైక్‌తో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వచ్చాడు అలెక్సా బెనైయ్ అనే యువకుడు.. ఎన్నోసార్లు హెచ్చరించారు.. పలుమార్లు పట్టుకున్నారు.. చివరకు పలు సందర్భాల్లో కేసులు పెట్టినా తీరు మార్చుకోలేదు.. అయితే, ఓ ఘటన ఆ యువకుడి మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేసింది.. నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లి సహా బిడ్డ మరణించిన వార్త చూసి తట్టుకోలేకపోయిన ఆ యువకుడు.. పూర్తిగా మారిపోయాడు.. తాను ఒక్కడిని మారితే ఎలా.. మరికొందరిలో అవగాహన కల్పించాలని అనుకున్నాడేమో.. తేనాం పేటలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర.. రేసింగ్‌లు, స్టంట్స్ చేయవద్దు.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ కరపత్రాలు పంచాడు.. ఓ ప్లకార్డు పట్టుకుని అందరికీ కనబడేలా దానిని ప్రదర్శించాడు.. ఆ యువకుడులో ఇంతలా మార్పు రావడాన్ని చూసి అభినందనలు తెలుపుతున్నారు తమిళనాడు యువత.. ఇక, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.